Pawan Kalyan : రాళ్ల దాడిపై పవన్ కళ్యాణ్ సెటైర్..! ప్రతీ సారి పాత కథేనా?
Pawan Kalyan : ఇటీవల జరిగిన ఒక రోడ్ షోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఒక దుండగుడు రాళ్లతో దాడి చేశాడు. ప్రస్తుతం దీనిపైనే ఏపీలో తీవ్రంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. సీఎంపై రాయితో దాడి చేసిన ఘటనను సోషల్ మీడియాలోనూ, ఇటు మేయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
మొదట ఈ విషయాన్ని వైసీపీ తీవ్రంగా జనాల్లోకి తీసుకెళ్లాలని, సింపతీ కొట్టేసి ఓట్లను రాబట్టుకోవాలని ప్లాన్ వేసింది. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచార సభల్లో ప్రసంగాలతో వాటిని అడ్డుకున్నారు. పైగా ప్రతీ సారి ఇది వర్కవుట్ కాదని హెచ్చరించారు.
ఇది చంద్రబాబు చేసిన పనిగా అభివర్ణిస్తూ వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు వెంటనే రంగంలోకి దిగారు. నిన్న గాజువాకలో జరిగిన సభలో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడి 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఘటనను అందరికీ గుర్తు చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జగన్మోహన్ రెడ్డి ఇదే కథను రిపీట్ చేస్తే ఎవరు నమ్ముతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ‘గత 2019 ఎన్నికలకు ముందు ‘కోడికత్తి’ని తీసుకువచ్చాడు.. సింపతీ కొట్టేసి గెలిచాడు. ఈ సారి ‘కోడి కత్తి 2.0’గా రాళ్లదాడిని మలుచుకోవాలని చూస్తున్నారు. దయచేసి ఈ సెంటిమెంట్ డ్రామాలు ఆపండి’ అని హితవు పలికారు.
జగన్ గాయపడితే రాష్ట్రం దెబ్బతిన్నట్లు పెయింటింగ్ వేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. 15 ఏళ్లుగా అమర్ నాథ్ ను దహనం చేసినప్పుడు ఏం జరిగిందని ప్రశ్నించారు.