Mark Shankar : మార్క్ శంకర్ సేఫ్.. ICU నుండి నార్మల్ రూమ్ కి షిఫ్ట్
Mark Shankar Latest Photo : సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ఆ పిల్లాడికి సంబంధించిన లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం మార్కు జనరల్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. పవన్తోపాటు ఆయన భార్య అన్నా లెజ్నోవా దగ్గరుండి బాబును చూసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు ఆ చిన్నారి ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
ICU నుండి నార్మల్ రూమ్ కి మార్క్ శంకర్ షిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం ఇది. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) నుండి సాధారణ గదికి తరలించారు. ఇది ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందనడానికి సూచనగా భావిస్తున్నారు. అభిమానులు మరియు శ్రేయోభిలాషులు మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.