Pawan Kalyan OG : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఆడియో రైట్స్

Pawan Kalyan OG
Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ విడుదలైన ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాకి తాత్కాళిక బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే 72 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.
ఇక కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అన్నీ కుదిరితే ఈ సినిమా ఆగష్టు లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో రైట్స్ 20 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్టు టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది అతి పెద్ద రికార్డుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
TAGS Pawan Kalyan MoviesPawan Kalyan OGPawan Kalyan OG Audio Rightspawan kalyan OG movieTollywood Updates