Pawan Kalyan New Movie : ప్రశాంత్ నీల్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా..300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్!

Pawan Kalyan New Movie
Pawan Kalyan New Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ కారణంగా ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘హరి హర వీరమల్లు’ చిత్రాలను పక్కన పెట్టేసాడు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఈ సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమాలు ఎప్పుడు పూర్తి అవుతుందో ఇంకా తెలియని పరిస్థితి, కానీ అప్పుడే తదుపరి చిత్రాల గురించి కూడా కమిట్ అయిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్ గానే ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఇప్పుడు రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. హోమబుల్ సంస్థ పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితమే భారీ మొత్తం లో అడ్వాన్స్ ఇచ్చింది. ఈ ఏడాది లో చేస్తాను అని వాళ్లకు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ కూడా ఇచ్చేశాడట. హోమబుల్ సంస్థ కాబట్టి కచ్చితంగా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అయ్యి ఉంటాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి మరి.