Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మూవీస్.. ఇప్పట్లో కష్టమేనా?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారంలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. పంచాయతీ రాజ్ తో పాటు మరో నాలుగు శాఖలను ఆయన పర్యవేక్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాడు. అధికారులతో సమీక్షలు నిర్వహించడం, వారికి ఆదేశాలివ్వడం, సూచనలు చేయడం చేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారిక కార్యాచరణలపైనే ఫోకస్ చేశారు.
పొలిటికల్ కెరీర్ ను కొంచెం పక్కన పెట్టి మూవీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం #OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన చేతిలో ఉన్నాయి. ఇందులో ఓజీ దాదాపుగా పూర్తయ్యే స్టేజీలో ఉంది. మిగిలిన రెండు సినిమాల షూటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత వీటిని కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారని అందరూ భావించారు.
అయితే, రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో భాగం కావడంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు. కానీ, ఇవి చాలా వరకు పూర్తవడంతో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. మూడు నెలల వరకు షూటింగ్స్ చేయలేనని పవర్ స్టార్ క్లియర్ గా చెప్పేశారట. తర్వాత వారానికి రెండు, మూడు రోజులు షూటింగ్ కు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
‘హరిహర వీరమల్లు’ 2024 చివరికల్లా రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ప్లాన్ చూస్తున్నారు. పవన్ ఈ మూవీకి ఓ 20-25 రోజులు కాల్ షీట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుందట. ఈ విషయాన్ని నిర్మాతే స్వయంగా తెలిపారు. పవన్ కూడా ముందుగా ఈ సినిమానే పూర్తి చేసే అవకాశం ఉందట. తర్వాత ఓజీ కోసం డేట్స్ కేటాయించవచ్చని తెలుస్తోంది.
ఓజీ ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని కన్ఫర్మ్ అయ్యింది. హరిహర వీరమల్లు పూర్తి చేసిన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావచ్చు. దీంతో డిసెంబర్ లో రిలీజ్ అనుకుంటున్నా అది సాధ్యం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. 2025 ప్రథమార్థంలో హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వచ్చని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వచ్చే ఏడాదిలోనే జరగనుంది. హరీష్ శంకర్ ఈ విషయంలో క్లారిటీతో ఉన్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేదనే అనిపిస్తుంది.