Pawan Kalyan-Nara Lokesh : ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి కౌగిలించుకుని తమ స్నేహబంధాన్ని చాటారు. పవన్ కల్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీకి పరిచయం చేశారు. మోదీ కూడా చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఇద్దరితో కలిసి ప్రజలందరికీ అభివాదం చేశారు.
చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2009 లో 18 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా కూడా తెలంగాణ ఉద్యమం కారణంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ సపరేట్ గా జనసేన పార్టీ పెట్టుకుని దాదాపు 10 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకుండా కొనసాగించారు. ఈ క్రమంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి తీవ్ర విమర్శల పాలయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కేందుకు వెళ్లాడు. ఈ సమయంలో పవన్ వద్దని వారించాడు. నారా లోకేశ్ ముఖ్యమంత్రిగా కొడుకుగా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేదు. అయినా తన హుందాతనాన్ని చాటుకున్నాడు. పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కడంపై నారా లోకేశ్ పై జనసేన, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు లోకేశ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
నారా లోకేశ్ పై విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. మీరు అంటే ఎంతో గౌరవం పెరిగిందని చర్చించుకుంటున్నారు.చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ నారా లోకేశ్ కు అండగా నిలబడ్డాడు. జైలుకు వెళ్లి ఆయన్ని పరామర్శించాడు. బయటకు వచ్చి పొత్తు కచ్చితంగా పెట్టుకుని జగన్ ను ఓడిస్తామని చెప్పాడు. ఇలా అన్ని రకాలుగా పవన్ టీడీపీకి, వ్యక్తిగతంగా లోకేశ్ కు సాయం చేశాడు కాబట్టే లోకేశ్ ఇంతలా ఆయన్ని అభిమానిస్తున్నారని రెండు పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.