KCR-Pawan Kalyan : మీడియా అంటే కొందరికి చిన్న చూపు ఉంటది. మరికొందరు ఎగతాళిగా మాట్లాడుతారు. జర్నలిస్టులు అంటే కూడా కొందరు నాయకులకు అసలే గిట్టదు. కొన్ని సమయాల్లో మీడియాను దూరం పెడుతారు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీడియాను దగ్గరకు తీసుకుంటారు. మిడియా తో మాట్లాడేటప్పుడు కూడా దురుసుగా మాట్లాడుతారు.చిన్న చూపు చూస్తారు. మీడియా కు ఇచ్చే ఇంటర్వ్యూ లో కూడా కొందరు నాయకులు సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంభిస్తారు.సూటిగా సమాధానం చెప్పకుండా వంకర మాట్లాడుతారు.మీడియా లో వచ్చే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తుంటారు. కాబట్టి నాయకులు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే వాళ్లకు అంత ప్రజాదరణ దొరుకుతుంది.
మీడియా ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రముఖ సినీ నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియదని జర్నలిస్ట్ సాయి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని కూడా హితువు కోరిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదివిన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు జర్నలిస్ట్ సాయి పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసే స్థాయి సాయి కి లేదని జనసేన నాయకులు మండిపడుతున్నారు.
జనసేన అధినేత కొద్దీ రోజులు మీడియాను పక్కన పెట్టారు. అసలు మీడియా తో నాకు అవసరం లేదని కూడా మాట్లాడారు.తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడును కొద్దీ రోజులు పక్కకు పెట్టారు పవన్ కళ్యాణ్. తిరిగి ఆయన తో సన్నిత సంబంధాలు పెట్టుకున్నారు. ఎన్నికలు రాగానే పవన్ కళ్యాణ్ కు మీడియా అవసరం గుర్తుకు వచ్చింది.ఇప్పుడు మీడియా కోసం తహతహలాడుతున్నారు.ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాను పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు.తన ఎన్నికల ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. కేసీఆర్ ను చూసి పవన కళ్యాణ్ నేర్చుకోవాలి అని జర్నలిస్ట్ సాయి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ టీవీ 9 కు నాలుగు గంటల పాటు ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతో ఓపికగా ఇచ్చారు. సమాదానాలు కూడా నేరుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి కేసీఆర్ ను చూసి జనసేన అధినేత పవన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని జర్నలిస్ట్ సాయి పలికిన పలుకులు పవన్ అభినులతోపాటు నాయకుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.