Pawan Kalyan : డిప్యూటీ సీఎం పదవిపై పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి ఉన్నట్లు జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ ఆంగ్ల మీడియాతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడంతో పాటు కీలక శాఖలను తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొన్నటి వరకు పవన్ ప్రభుత్వంలో చేరకపోవచ్చు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని తన పార్టీని బలోపేతం చేసుకునే ఉద్దేశ్యంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉంది. అదేరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారేమో వేచి చూడాలి.