Pawan Kalyan : కొడుకు కోసం సింగపూర్ లోనే పవన్ కళ్యాణ్.. ఇండియాకు ఎప్పుడంటే?

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపింది. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని సమాచారం. ప్రస్తుతం ఆయన నడవగలుగుతున్నా, ఊపిరితిత్తుల్లోకి చేరిన పొగ ప్రభావంతో ఇంకా ఆక్సిజన్ మాస్క్ అవసరమవుతుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరూ సింగపూర్‌లోనే ఉన్నారు. చిరంజీవి త్వరలో భారత్‌కి రానుండగా, పవన్ మాత్రం కొద్దిరోజుల తర్వాతే వస్తారు. పవన్ హైదరాబాదు వచ్చాక వెంటనే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం.

TAGS