Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి పూర్తి జీతం తీసుకొని ప్రజలకు సేవ రూపంలో తిరిగి ఇచ్చేస్తా అంటూ గతంలో ప్రకటించారు. ఇప్పుడు తను ఇచ్చిన మాటను తానే వెనక్కి తీసుకుంటున్నానంటూ మరో ప్రకటన చేశాడు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పెన్షన్ల పంపణీలో కూటమి నేతలు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇందులో బాగంగానే మొదటి సారి ఎమ్మెల్యేగా పిఠాపురంలో పర్యటించిన పవన్ అక్కడ ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీలో పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు.
ఆ తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని కొందరు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వలంటీర్లు లేకుండా కూడా పెన్షన్లను ఇంటి దగ్గరకు తీసుకువచ్చారు కదా..! వలంటీర్లు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెన్షన్లు ఆగాయా.?’ అంటూ ప్రశ్నించారు. ‘గత ప్రభుత్వంలో 4 నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ పంపిణీ కార్యక్రమం తమ ప్రభుత్వంలో 2 రోజుల్లోనే పూర్తి చేసి చూపించాం. ఇచ్చిన హామీ ప్రకారం గతంలో కంటే రెట్టింపు అందజేశాం’ అన్నారు పవన్ కళ్యాణ్.
వలంటీర్లను రోడ్డున పడేయలేం. వారి కోసం ప్రత్యామ్మాయం వెతుకుతున్నాం అన్న పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ శాఖలో జరిగిన అవినీతి, అప్పులు చూసి మతిపోయిందని, అన్ని అప్పులు ఉన్న శాఖలో జీతం తీసుకొని పని చేయడం కరెక్ట్ కాదని భావించి తీసుకోకుండా పని చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు.
కొత్త ఫర్నీచర్ గానీ, మరమ్మతులు గానీ ఏవీ ఉండద్దని చెప్పా అంటూ ఒక నాయకుడు ప్రజాధనం పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో పవన్ తెలియచేస్తే. జగన్ మాత్రం తన కోసం రూ. 500 కోట్లను వెచ్చించి రుషికొండ మీద ప్యాలస్ లు కట్టుకొని ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో తెలియచెప్పారు.