Pawan Kalyan : అమిత్ షా, బాబు ఆఫర్‌ ను సున్నితంగా తిరస్కరించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపం కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా అధినేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎం) గా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో మంత్రులుగా 23 మంది ప్రమాణం చేశారు. ప్రధాని మోడీ సహా సినీ, రాజకీయ, ఇతర రంగాల అతిరథ మహారథులు కార్యక్రమానికి తరలివచ్చి.. చంద్రబాబు, పవన్‌ను ఆశీర్వదించారు.

చంద్రబాబు తమ కేబినెట్ లోని మంత్రులకు ఎవరికి ఏ పోర్ట్ పోలియో అప్పగిస్తారన్న టెన్షన్ ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠతగా ఉంది. కీలమైన హోం, ఇండస్ట్రీ, ఐటీ, ఫైనాన్స్, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖలు వ్యక్తుల పరంగా పార్టీల పరంగా ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలైంది. ప్రత్యేకించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమి అప్పగిస్తారని ఆసక్తిగా అభిమానుల్లో ఉంది.

పవన్ కళ్యాణ్‌కు దేశభక్తి ఎక్కువ. ఆయనకు దేశమన్నా, త్రివిధ దళాలు అన్నా, సాయుధ బలగాలు అన్నా, పోలీసులంటే గౌరవం. ఎందుకంటే ఆయన కానిస్టేబుల్ కొడుకు కాబట్టి. ఈ విషయాన్ని జనసేనాని చాలా సార్లు చూపించారు కూడా. కులం, మతం, పేద, ధనిక అంతరాలు ఉండద్దన్నది పవన్ ఆకాంక్ష. తన సినిమాల్లో కూడా ఇలాంటి సన్నివేశాలను ఎక్కువగా ఉండాలని కోరుకుంటారట. శాంతి భద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రమైనా, ప్రాంతమైనా, దేశమైనా డెవలప్ అవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం.

ఆయన తన రోడ్ షోలు, ర్యాలీలు, సభల్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూను ప్రధానంగా ప్రస్తావించేవారు. పవన్‌ కు హోం శాఖ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి తర్వాత శక్తివంతమైన పోర్ట్ పోలియో హోం మినిస్టరే. అందుకే మారు మాట లేకుండా పవన్ కు హోం ఇవ్వాలని జనసైనికులు బాబును కోరుతున్నారట. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే శాఖ తీసుకోవాల్సిందిగా పవన్‌ను కోరారట.

కానీ పవన్ కళ్యాణ్ వారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, పంచాయతీరాజ్, అటవీ శాఖను తీసుకునేందుకు ముందుకొచ్చారు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటామని పవన్ బలంగా నమ్ముతారు. ఈ శాఖలు తీసుకుంటే గ్రామాలకు వెళ్లచ్చు. అక్కడ డెవలప్ చేయచ్చు. దీనికి తోడు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు అని అనుకున్నారట.

TAGS