Pawan Kalyan : కేబినెట్ భేటీకి రాని పవన్ కల్యాణ్.. అనారోగ్యమే కారణం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు. అలాగే రతన్ టాటా అంత్యక్రియలకు సైతం పవన్ హాజరుకాలేదు. ఇందుకు ఆయన అనారోగ్యంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు సమాచారం. అందువల్లనే ఆయన ఏపీ కేబినెట్ భేటీకి హాజరు కాలేదని తెలుస్తోంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రతన్ టాటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఇటీవల పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం పవన్ కల్యాణ్ తిరుమలకు వెళ్లారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అయితే అప్పటికే పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంలోనే ఆయన తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పాల్గొన్నారు. డిక్లరేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం కూడా పవన్ కల్యాణ్ జలుబు, దగ్గుతూ బాధపడుతున్నట్లు తెలిసింది.

TAGS