Pawan Kalyan : పిఠాపురంలో మరో 12 ఎకరాలు కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ 3.52 ఎకరాలు కొనుగోలు చేసిన ఆయన తాజాగా మరికొంత భూమిని కొన్నారు. మంగళవారం దానికి సంబంధించిన రిజస్ట్రేషన్ ప్రక్రియను పిఠాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తి చేశారు. తాను పిఠాపురం నియోజకవర్గంలోనే శాశ్వత నివాసం ఏర్పరచుకుంటానని పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నం.13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవను కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పవన్ కల్యాణ్ తరపున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ పూర్తి చేశారు.