Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. సింగపూర్ యూనివర్సిటీ నుంచి ఆమె మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. ఈ మేరకు జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆమె పట్టా అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ‘తీన్ మార్’లో పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా నటించారు. ఈ మూవీ సమయంలో వీళ్ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారి అన్నా లెజినోవాను 2013లో పవన్ కల్యాణ్ వివాహమాడారు.