Pawan Kalyan : పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంటుకు చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్

Pawan Kalyan
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీల మధ్య గొడవలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా లేదా అనేది చూడాలి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తే.. వారి కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని తేలిపోయింది. ఈ వేడుక కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప-2 ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా డిసెంబర్ 1న పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ వస్తాడని ప్రచారం జరుగుతోంది.