Pawan Fans : పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు చట్ట సభల్లోకి అడుగపెట్టలేదు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2009 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014 లో సొంత పార్టీని స్థాపించిన పవన్ టీడీపీ, బీజేపీతో జతకట్టి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాడు. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేయలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న పవన్ ఒంటరిగానే బరిలోకి దిగాడు. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఒక్కచోట కూడా గెలవలేదు.
ఈసారి అధ్యక్ష అనబోతున్నాడా?
అయితే ఈసారి కొంత ముందు నుంచే గ్రౌండ్ వర్క్ స్టా్ర్ట్ చేశాడు జనసేన అధినేత పవన్ కల్యాన్. వారాహి యాత్రతో రాష్ర్టంలో తన పర్యటన సాగించాడు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో సఫలమయ్యాడు. ఇక అదేఊపుతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచాడు. ఇక్కడ పవన్ గెలుపు ఏకపక్షమే అని అధికార పార్టీ సర్వేలోనూ తేలినట్లు సమాచారం.
అభిమానులు ఖుషీ..
ఎట్టకేలకు తమ అభిమాన హీరో, జనసేత అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవన్ అనే నేను అంటూ… ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం ఎప్పుడా చేస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అసెంబ్లీ తమ హీరో అధ్యక్ష అని అంటుంటే చూసి ఆనందించాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో పవన్ కలతో పాటు కోట్లాది అభిమానుల కల నెరవేరబోతున్నది. మరో వైపు జనసైనికులు సైతం సంబరాలకు సిద్ధమవుతున్నారు.
రాజకీయాలకు పనికిరాడని..
ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు కావడంతో అభిమానులు, జన సైనికులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.ఇక మొదటి సారి అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు పవన్ కల్యాన్ రాజకీయాలకు పనికిరాడంటూ తామేదో పండితులమనే రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. పవన్ కల్యాన్ వైసీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత జీవితంపైనా దాడికి దిగారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పవన్ ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయారు. ఈసారైనా పవన్ ను పక్కాగా పంపించాలని ఆ పార్టీ నేతలు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు జనసేన అధినేతకు వెన్నంటే నిలిచారు. టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా పవన్ పార్టీ నుంచి అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో పోటీకి దిగిన విషయం తెలిసిందే .అయితే ఆ పార్టీ సగానికి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక అదే సమయంలో పవన్ కల్యాణ్ రికార్డు స్థాయి మెజార్టీ సాధిస్తారని ఏపీలో పందెలు సైతం కాస్తున్నారు. జనసేనకు ఈసారి ఎక్కువ సీట్లు వస్తే రాబోయే ప్రభుత్వంలో పవన్ కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు చూడాలని అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.