Pawan Home Minister : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారులపై లైంగికదాడులు పెరుగుతున్నాయి. వాటికి హోం మినిస్టరే బాధ్యత తీసుకోవాలి, లేదంటే తానే హోం మంత్రిగా మారాల్సి వస్తుందని అన్నారు. అయితే ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఢిల్లీకి పయనమై కేంద్రం హోం మినిస్టర్ అమిత్ షాతో భేటి అయ్యారు.
అమిత్ షా – పవన్ కళ్యాణ్ భేటి కేవలం పావుగంటనే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. అసలు వీరు అంత తక్కువ సమయం ఏం మాట్లాడుకున్నారనేది హాట్ టాపిక్. తనకు హోం మినిస్టర్ ఇవ్వాలని అడిగేందుకే ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో మాట్లాడారా..? లేక కూటమిలో టీడీపీ హోం మంత్రిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారా? పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారా? అనేది తెలియాలి.
ఈ భేటి గురించి జనసేన కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం పవన్ కళ్యాణ్ భేటి ఫొటోలను మాత్రమే షేర్ చేసింది. దీంతో వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ పదవిని దక్కించుకోవడం కోసమే ఢిల్లీకి వెళ్లాడని.. వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ భేటి మర్యాదపూర్వకమైన, సాధారణ సంభాషణ మాత్రమే అని.. పెద్దగా ఏం మాట్లాడలేదనేది జనసేన నేతలు చెప్తున్నారు.
జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ లో కడూ ఏ విషయాన్ని పంచుకోలేదు. కేవలం ఇద్దరి భేటీకి సంబంధించిన ఫోటోలు మాత్రమే షేర్ చేసింది. వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది. పవన్ హోం మినిస్ట్రీ కోసమే ఢిల్లీ పెద్దలను కలిశారని, ఇది ముమ్మాటికీ వంగలపూడిపై కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. నాలుగు నెలల క్రితం బుక్ చేసుకున్న అపాయింట్ మెంట్ తో అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారని జనసేన చెప్తోంది.