Amith Shah : పవనే సీఎం.. అమిత్ షా కండీషన్? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు!

Amith Shah

Amith Shah

Amith Shah : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహరం ఇంకా కొలిక్కి రాలేదు. పొత్తుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే ఈ పార్టీలు ప్రచార బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ పొత్తు చర్చల్లో గతవారమే ఓ కీలక అడుగు పడింది. చంద్రబాబు, అమిత్ షా భేటీ అయ్యారు. తర్వాత పవన్ కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశమయ్యారు. ఆ వెంటనే పొత్తు ప్రకటన ఉంటుందని భావించినా.. రోజులు గడుస్తున్నా ప్రకటన మాత్రం రావడం లేదు. దీంతో ఆ భేటీపై రకరకాల ఊహగానాలు వినపడుతున్నాయి.

టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే అసెంబ్లీ, లోక్ సభ సీట్లను ఇంకా ఎక్కువగా బీజేపీ కోరుతోందనే చర్చ సాగుతోంది. ఈక్రమంలోనే ఇటీవల అమిత్ షా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్డీఏలోకి కొందరు మిత్రులు వస్తున్నారని చెప్పారు. అయితే ఏ పార్టీలు వస్తున్న విషయం మాత్రం చెప్పలేదు.

అయితే ఇక్కడా ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. చంద్రబాబు తర్వాత సీఎం జగన్ కూడా హస్తినకు వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. ఆయన కూడా ఎన్డీఏలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేశారని, అందుకే బీజేపీ ఇటు జనసేన,టీడీపీ కూటమిలోకి వెళ్లాలా? వైసీపీతో కలిసి నడువాలా? అనే మీమాంసలో పడినట్లు చెబుతున్నారు. జగన్ పర్యటన పొత్తుల కోసం కాదని, పెండింగ్ సమస్యలపై వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నా రాజకీయాలపై కూడా కచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పవచ్చు.

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గురించి మీడియా వర్గాల్లో మరో ప్రచారం మొదలైంది. టీడీపీ, జనసేన కూటమిలోకి చేరడానికి బీజేపీ ఓ కండీషన్ పెట్టిందని చెబుతున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, నారా లోకేశ్ కాకుండా పవన్ కల్యాణ్ ను చేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కూటమి ఎన్ని సీట్లు గెలిచినా పవన్ నే సీఎం చేయాలని అమిత్ షా కండీషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ హామీ ఇస్తే కాపుల ఓట్లు గంపగుత్తగా కూటమికి పడుతాయని అమిత్ షా సూచించినట్టు చెబుతున్నారు.

అవసరమైతే సీఎం సీటు పంపకంపై టీడీపీ, జనసేన ఒక అగ్రిమెంట్ కు వచ్చినా తమకేమి అభ్యంతరం లేదని, మొదటి ఆరు నెలలు పవన్ కల్యాణ్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేశ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నా సమ్మతమేనని, బీజేపీ అధికారంలో వాటా కోరదని అమిత్ షా పేర్కొన్నట్టు చెబుతున్నారు.

అయితే ఈ కండీషన్ పై చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ షరతుకు అంగీకరించకుంటే పవన్ కల్యాణ్ ను దూరం చేసినట్టు అవుతుందని, అంగీకరిస్తే టీడీపీ నష్టపోయే ముప్పు ఉందని చంద్రబాబు ఆలోచనలో పడినట్టు చెబుతున్నారు.

TAGS