Patel Family : గుజరాత్ కు చెందిన ఓ కుటుంబం ఇప్పటి వరకు 630 లీటర్ల రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. అహ్మదాబాదులోని మణేక్ బాగ్ ప్రాంతానికి చెందిన పటేల్ కుటుంబంలో 27 మంది సభ్యులున్నారు. వీరిలో 16 మంది ఇప్పటి వరకు 50 సార్లకు పైనే రక్తదానం చేశారు. 100 ఏళ్లకు దగ్గర్లో ఉన్న నలుగురు వృద్ధులు ఏకంగా 100 సార్లకు పైగా రక్తాన్ని దానమివ్వడం విశేషం. మొత్తంగా ఇప్పటి వరకు 1400 యూనిట్ల రక్తదానం చేశారు. ఒక్కో యూనిట్ కు 450 మిల్లీ లీటర్ల చొప్పున చూసుకుంటే ఇప్పటి వరకు వారు 630 లీటర్ల వరకు దానం చేసింది.
నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో రక్తదాతలను అభినందిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో ఈ పటేల్ కుటుంబం గురించి తెలిసింది. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ మౌలిన్ పటేల్ మాట్లాడుతూ ‘‘సత్యసాయి బాబా స్ఫూర్తితో మా మామ రమేశ్ భాయ్ ఈ రక్తదానాన్ని ప్రారంభించారు. ఆయన 94 సార్లు రక్తదానం చేశారు. ఆయన కుమారుడు 103 సార్లు రక్తదానం చేశారు. దాన్నే మా కుటుంబం సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తోంది. అని తెలిపారు.
ఇదే ప్రాంతానికి చెందిన మలవాంకర్ కుటుంబం 790 యూనిట్లు (356 లీటర్ల) రక్తదానం చేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. ఏదేమైనా రక్తదానంతో ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతూ ఎంతో మంది యువతకు వీరంతా ప్రేరణగా నిలుస్తున్నారు.