Pashupatinath : శివరాత్రి వేళ బయటకొచ్చిన పశుపతినాథుడి అద్భుత చిత్రం.. సోషల్ మీడియాలో వైరల్..
Pashupatinath Shiva Lingam : హైందవ సంస్కృతి ప్రపంచంలోనే విభిన్నమైనది, గొప్పనైనది. భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని వివిధ దేశాల్లో హిందువులు ఉన్నారు. భారత్ లోనే కాదు వివిధ దేశాల్లో అద్భుతమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన దేవాలయం నేపాల్ లోని పశుపతి నాథుడి ఆలయం. ఈ ఆలయ విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ఈ గర్భగుడిలోని పశుపతినాథుడి చిత్రాలు బయటకు రావు. చాలా నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం నిన్న శివరాత్రి వేడుకలు కూడా అక్కడ ఘనంగా జరిగాయి.
పశుపతినాథుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భారత్ నుంచి కూడా తరలివెళ్లారు. శివరాత్రి సందర్భంగా నిన్న పశుపతినాథుడి అరుదైన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను ఎంతో అపురూపంగా ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం విశేషం. ఎంతో మహిమాన్విమైన పశుపతినాథుడి ఆలయం గురించి కొంత తెలుసుకుందాం..
మన సరిహద్దు దేశమైన నేపాల్ లోని ఖాట్మండులో పవిత్ర బాగ్మతి నది ఒడ్డున పశుపతినాథ్ ఆలయం ఉంది. “పశుపతినాథ్” అనే పేరు పశువులకు లేదా జీవులకు అధిపతి అని యజమాని అనే అర్థం ఉంది. సకల జీవులకు అధిపతి ఆ శివయ్యే కాబట్టి ఈ పేరు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని శివుని పవిత్ర నివాసంగా హిందూ మతం చెబుతోంది.
ఈ నిర్మాణ కళాఖండం నేపాలీ పగోడా శైలిలో రూపొందించబడింది. నేపాల్ గొప్ప చారిత్రక, కళాత్మక చరిత్రను హైలైట్ చేసే సంక్లిష్టమైన శిల్పాలు, అందమైన అలంకరణలతో అలంకరించబడింది. ఈ పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి, తరతరాలుగా ఆచరించబడుతున్న ఆచారాలలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఆసియాలోని నాలుగు అతి ముఖ్యమైన ధార్మిక ప్రదేశాలలో ఒకటిగా.. ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన శివాలయంగా పశుపతినాథ్ ఆలయం కీర్తిపొందింది.
ఈ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు రావడం విశేషం. ఈ ప్రదేశం 246 హెక్టార్ల (2.56 కి.మీ చదరపు) పెద్ద విస్తీర్ణంలో ఉంది. పవిత్ర నది వెంట 518 చిన్న మందిరాలు, ఆశ్రమాలు, ఘాట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది నేపాల్ లోనే అతిపెద్ద ఆలయ సముదాయం. ఈ ఆలయ సముదాయం నేపాలీ వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణ మాత్రమే కాదు.. దాని అందాన్ని పెంచే ఇతర ముఖ్యమైన దేవాలయాలను కూడా కలిగి ఉంది. వాసుకి నాథ్ ఆలయం, భైరవ్ నాథ్ ఆలయం, గుహ్యేశ్వరి ఆలయం అన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిఉన్నాయి. ఇది మతం, వాస్తుశిల్పం, ఆచారం అన్నీ కలిసే ప్రదేశంగా ప్రశంసలు అందుకుంటోంది.
పశుపతినాథ్ ఆలయం ప్రశాంతతకు నిలయమనే చెప్పాలి. లయబద్ధమైన మంత్రోచ్ఛారణలు, ఆచారాల ద్వారా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. గాలి ధూపం సువాసనతో ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతుంటాయి. ప్రపంచంలోని ప్రతీ హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయమిది అని చెప్పడం సందేహం