Paruchuri : ఫ్యామిలీ స్టార్ పై పరుచూరి కామెంట్స్.. ఏం లోపమో చెప్పిన రైటర్..

Paruchuri

Paruchuri

Paruchuri Comments : విజయ్‌ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ అనుకున్నంగా ఆడలేదు. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించాడు. దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ చేశాడు. ఈ సినిమాలో విజయ్ తన బాడీ లాంగ్వేజ్ పరిధి దాటడం వల్ల ఫలితం మారి ఉండవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. సెకండ్ ఆఫ్ లో ఒక పావు గంట (15 నిమిషాలు) మించి సినిమా మొత్తం బాగానే ఉందని ఆయన అన్నారు. ‘పరుచూరి పలుకులు’ పేరుతో గోపాలకృష్ణ నిర్వహిస్తున్న సైట్ లో ‘ఫ్యామిలీ స్టార్’ గురించి రాశారు.

‘ఫ్యామిలీ స్టార్‌’ రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా అన్నారు. ఇందులో యాక్షన్‌ డ్రామా పదం కీలకం. ఈగో కలిగిన అమ్మాయి, ఈగో అబ్బాయికి మధ్య అనుబంధం ఏర్పడితే, అది ఎన్నిరకాల పరిణామాలకు దారి తీస్తుందనేది ఈ చిత్ర కథ. కుటుంబ భారమంతా హీరోనే మోస్తాడు. అలాంటి వ్యక్తి ఇంటిపై కథానాయిక అద్దెకు దిగుతుంది. వీరి మధ్య రొమాన్స్‌ డెవలప్‌ అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకుడు అనుకుంటాడు వారిద్దరూ కనెక్ట్‌ అవుతారని, ఈగో ఫ్యాక్టర్‌ కారణంగా.. గొడవలకు దారి తీయడంను ప్రేక్షకుడు అస్సలు ఊహించడు.

మూవీలో హీరోను పిసినారి వాడిలా చూపించాడు దర్శకుడు కానీ హీరో అతి జాగ్రత్తపరుడు. సినిమాను భాగాలుగా విభజిస్తే, హీరోయిన్‌ వచ్చిన తర్వాత ఆమెకో కథ, హీరో.. హీరోయిన్‌తో గొడవ పడి యూఎస్‌ వెళ్లడంతో ఒక కథ, హీరోయిన్‌ మిస్సయిన తర్వాత మరో కథ.. ఇలా విభజించుకోవచ్చు. కథా, కథా చాతుర్యంతో దర్శకుడు ఆడుకున్నాడు. కానీ, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. హీరో ఇమేజ్‌ కన్నా విభిన్నంగా ఫైట్స్‌ ఉండడం వల్ల మూవీ దెబ్బతిని ఉండవచ్చని నా అభిప్రాయం.

‘జగపతిబాబు పాత్ర హీరోయిన్‌ గురించి చెప్పకుంటే ఇద్దరూ విడిపోతారేమో అనిపించేలా కథనాన్ని నడిపాడు. విజయ్‌ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు మించి 50-60 మందిని కొట్టడం ఆడియెన్స్‌ ఆమోదిస్తున్నారేమో తెలియదు. క్లైమాక్స్‌లో చిన్న మెలో డ్రామా చూపించారు. ఈ కథ విజయ్‌ దేవరకొండదే. విజయ్‌ దేవరకొండ లవర్‌ బాయ్‌. ఆయనను దృష్టిలో పెట్టుకొని కథలు రాసేప్పుడు ఆడిటోరియానికి సరిపోయేలా ట్రీట్‌ రాస్తే, ఆ సినిమాలు ఎక్కువ హిట్‌ అయ్యే అవకాశం ఉంటుంది’ అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

TAGS