Palnadu District : పామాయిల్ ట్యాంకర్ బోల్తా.. ఆయిల్ తీసుకెళ్లేందుకు ఎగబడిన స్థానికులు

Palnadu District
Palnadu District : పామాయిల్ ట్యాంకర్ బోల్తాపడడంతో స్థానికులు బిందెలు, బకెట్లతో పామాయిల్ తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై చోటుచేసుకుంది. రాజుపాలెం మండలం అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై పామాయిల్ బోల్తాపడింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆయిల్ ట్యాంకర్ నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
పామాయిల్ ట్యాంకర్ బోల్తాపడిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి పామాయిల్ తీసుకు వెళ్లేందుకు బిందెలు, బకెట్లతో ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో ట్యాంకర్ ను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.