CM Chandrababu : గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 13,326 గ్రామాల్లో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆయన అభినందించారు. రూ.4,500 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ, పల్లెల్లో మళ్లీ వెలుగు తెస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో సంతోషం నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం ఎక్స్ లో పోస్టు చేశారు.