Pallavi Prashant : మాట తప్పిన  రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..మోసపోయిన అభిమానులు!

Pallavi Prashant

Big Boss 7 Winner Pallavi Prashant

Pallavi Prashant : గత ఏడాది జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రెండు గ్రూప్స్ మధ్య జరిగిన గొడవలే అని చెప్పొచ్చు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్ గా ఏర్పడి  ‘స్పై’ పేరుతో పాపులర్ అవ్వగా..అమర్ దీప్, ప్రియాంక జైన్ మరియు శోభా శెట్టి ఒక గ్రూప్ గా ఏర్పడి ‘స్పా’ పేరుతో పాపులర్ అయ్యారు.

అయితే ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ సింపతీ డ్రామా ఆడుతూ చివరి వరకు నెట్టుకొచ్చారు అనేది నెటిజెన్స్ అభిప్రాయం. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే మొదటి రోజు నుండి రైతు బిడ్డ యాంగిల్ వాడి, సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి, టైటిల్ ని గెలుచుకున్నాడు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే అతను గెలిచినా డబ్బులను మొత్తం రైతులకే ఇస్తాను అంటూ చెప్పిన ఒక మాటని మాత్రం అందరూ నమ్మారు.

నమ్మి అతన్ని గెలిపించారు కూడా. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి అడుగుపెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ లో ఏర్పడిన కొన్ని మార్పులను చూసి అతనికి ఓట్లు వేసిన అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు గెలిచిన వెంటనే వచ్చినప్పుడు ‘గెలిచిన ప్రతీ పైసా ని రైతుల కోసమే ఉపయోగిస్తా’ అని అన్నాడు. అప్పుడు ఒక మీడియా రిపోర్టర్ పల్లవి ప్రశాంత్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ మీ గ్రామం పక్కనే ఇటీవల ముంపు వచ్చి ఎంతో మంది రైతుల పొలాలు చెడిపోయాయి, నేను వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకి మీకు తోచినంత సహాయం చెయ్యొచ్చు కదా’ అని అడగగా, దానికి పల్లవి ప్రశాంత్ సమాధానం చెప్తూ ‘సహాయం చెయ్యడానికి నేను ఏమైనా ముఖ్యమంత్రినా?’ అని అంటాడు.

నిమిషం లోనే అతను మాట మార్చిన తీరుని చూసి అందరూ నోరెళ్లబెట్టారు. అయితే ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న ఆ డబ్బులతో ఒక్క రూపాయి కూడా రైతుల కోసం ఖర్చు చెయ్యలేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. దీని గురించి అడుగుతారనే భయం తోనే ఇప్పటి వరకు ఆయన ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని అంటున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్ రైతుల కోసం ఎదో చేస్తాడు అని నమ్మి ఓట్లు వేసిన అభిమానులు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.

TAGS