Pakistan Way : భారత్ దారిలోనే పాక్.. కొత్త నిర్ణయం వర్కవుట్ అవుతుందా?

Pakistan Way

Pakistan Way

Pakistan way of India : రెండు దేశాలకు ఒకే సారి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రపంచ దేశాల ఎదుట భారత్ పతాక సగౌరవంగా రెపరెపలాడుతుంటే.. దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం అప్రతిష్ట పాలవుతోంది. పాక్ తన అభివృద్ధి కంటే ఎక్కువ నిధులను భారత్ పతనం కోసమే వెచ్చించింది. అందుకే అక్కడ జనాలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే గతంలో భారత్ అవలంబించిన పద్ధతులనే ఆ దేశం అనుసరించాలని అనుకుంటోంది.

ప్రస్తుతం పాకిస్తాన్ తన కరెన్సీ విలువ పడిపోవడంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాల తప్పుడు విధానాలతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తాజాగా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇదే విషయాన్ని పాక్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రధానంగా నకిలీ నోట్ల బెడదతో అతలాకుతలమవుతోంది. వీటితో ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతోంది. కొత్త నోట్లు అంతర్జాతీయ ఆధునాతన భద్రతా సాంకేతికతతో ఉంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ వెల్లడించారు. ఇందుకోసం కొత్త డిజైన్లు, హై సెక్యూర్ నంబర్లను వాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఇది రానున్న కాలంలో అక్కడి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేయడంతో పాటు, ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదే క్రమంలో ఐఎమ్ఎఫ్ నుంచి ఆర్థిక సహకారం కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాయాది దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగడం, ఇంధన-ఆహార ఖర్చులు ఆకాశాన్ని తాకడం, సామాన్యులు రెండు పూటల తిండికి దూరం కావడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అలాగే అక్కడి ఫారెక్స్ నిల్వలు సైతం 3 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

నెలల పాటు జరిగిన చర్చల తర్వాత ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్ల అత్యవసర నిధిని పాకిస్తాన్ పొందగలిగింది. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి మిత్ర దేశాలు కూడా పాక్ విదేశీ మారక నిల్వలను పెంచడానికి తమ వంతు సాయం అందించాయి.

TAGS