Nuclear bombs : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయిల్, తదితర దేశాల మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు ఆయుధాల బలాన్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టాయి. ఇక అగ్రదేశం అమెరికా కూడా భారీ అణుబాంబులను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో జపాన్ లోని హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే దీని విలువ 24 రెట్లు అధికారికంగా ఉంటుందని అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పటికైతే ఈ అణుబాంబు తయారీ ప్రక్రియ ప్రారంభం కాలేదని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే, ప్రారంభిస్తామని చెబుతున్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా భారత్ తో పాటు అనేక దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్ వద్ద కూడా ఇవి ఉన్నాయి.1998లో పాకిస్థాన్ వీటిని సిద్ధం చేసుకుంది. అయితే ఏ దేశంలోనైనా అణుబాంబు నిర్వహణ అనేది చాలా సున్నిత అంశం. అందుకే దీని అపరేషన్ సిస్టం అంతా ప్రెసిడెంట్, ప్రధాని, ఒక ప్రత్యేక వింగ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక దీని వినియోగం నిర్ణయాన్ని పాకిస్థాన్ లో అధ్యక్షుడు, ప్రధాని సంయుక్తంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సైన్యం పాత్ర ఎక్కువగా ఉంటుంది.
అయితే పాకిస్థాన్ 1970 లోనే ఈ అణుబాంబు తయారీ ప్రక్రియను ప్రారంభించింది. భారత్ మాత్రం 1974లో తొలి అణు పరీక్షను నిర్వహించింది. ఇక పాకిస్థాన్ మాత్రం చైనా, క్యూబా సాయం తీసుకుంది. ఇక 1998లో అప్పటి ఎన్డీఏ సర్కారు నిర్వహించిన అణు పరీక్ష తర్వాత పాకిస్థాన్ కూడా అదే పరీక్షను నిర్వహించింది. ఇక అక్కడి నుంచి ఆదేశం తన వద్ద అణు నిల్వలు పెంచుకుంటూ వస్తున్నది. పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ మొత్తం అణు నిల్వల నిర్వహణ కొనసాగుతున్నది. అయితే ఎవరూ వీటిని యాక్సెస్ చేసే అవకాశం లేకుండా ఆదేశం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.