Pakistan : ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఆధిక్యంలో దూసుకుపోయింది. మొదటి టెస్టులో బాగానే ఆడినప్పటికీ చివరి రోజు తడబడడంతో ఇంగ్లాండుకు టెస్ట్ మ్యాచ్ సమర్పించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా రాణించా గెలవాలని పట్టుదలతో ఆడుతోంది. పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్ లో 366 పరుగులకు ఆలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్ లో బుధవారం ఇంగ్లాండ్ 239 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ డకేట్ 111 పరుగులు చేసి రాణించగా 211 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఇంగ్లాండ్ ఉండగా పాకిస్తాన్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ శ్రమించి వికెట్లు తీశాడు.
దీంతో ఇంగ్లాండ్ 239 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆట ముగించింది.
కాగా ఈ మ్యాచ్ లో ఆధిక్యం దిశగా పాకిస్తాన్ వెళ్ళింది. ఇంగ్లాండ్ 292 పరుగులకు ఆల్ అవుట్ కాగా పాకిస్తాన్ కు 70 పరుగులకు పైగా ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మూడో రోజు ఆటలో 103 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 178 పరుగుల ముందు ఉండగా చేతిలో ఇంకో ఆరు వికెట్లు ఉన్నాయి. మరో వంద నుంచి 150 పరుగులు చేస్తే పాకిస్తాన్ కు విజయం దక్కే అవకాశం ఉంది. కానీ ఇంగ్లాండ్ ని ఏ మాత్రం తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ మరోసారి దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
కాబట్టి 350 పరుగుల పైగా టార్గెట్ ఉంటేనే ఇంగ్లాండ్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మరో మూడు రోజులు ఆట మిగిలి ఉండగా పాకిస్తాన్ అనుకున్న ఒత్తిడి అధిగమించి పరుగులు చేయడం వికెట్లు తీయడం చేస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది. ఈ లోపం తో మరోసారి ఈ మ్యాచ్ ఓడిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకుంటున్నారు.