ICC rankings : ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో చాలా మార్పులు కనిపించాయి. మొన్నటి దాకా టాప్-10లో ఉన్న చాలా మంది ప్లేయర్లు వారి ర్యాంకులను కోల్పోగా, కొందరు కొత్త ఆటగాళ్లు టాప్-10లోకి ప్రవేశించారు. ఇందులో ఒకరు పాకిస్తాన్ టీమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ నోమన్ అలీ. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చూపాడు. నోమన్ ఇప్పుడు ఏకంగా 8 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నోమన్‌తో పాటు, పాకిస్థాన్ జట్టులోని ఏ బౌలర్‌ను టాప్-10లో చేరలేదు.
9వ స్థానంలో నోమన్ ..
నోమన్ అలీ రెండు మ్యాచ్ లలో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. సగటు 13.85 ఉంది. కాగా, రెండు ఇన్నింగ్స్‌లలో 5-5 వికెట్లు తీశాడుు. ఈ ప్రదర్శన ఆధారంగా, నోమన్ ఐసీసీ విడుదల చేసిన కొత్త టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నేరుగా 8 స్థానాలు ఎగబాకాడు. ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నాడు. అలాగే 759 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్. నోమన్ ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు తరపున 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 32 ఇన్నింగ్స్‌లలో 27.66 సగటుతో 67 వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను 6 సార్లు సాధించాడు.
రబాడ నంబర్-1..
టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా మొదటి స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఉన్నాడు.