Toss Fixing : రోహిత్ శర్మపై టాస్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న పాక్ క్రికెటర్లు
Toss Fixing : ఆడలేక మద్దెల ఓడు అంటారు. ఆట రాని వాడు మద్దెల సరిగా కొట్టకపోవడం వల్లే తాము ఓడామని చెబుతుంటారు. సామర్థ్యం లేని వారు నిందలు వేసి తప్పించుకోవడం మామూలే. ఈ సంప్రదాయం ఎందులోనైనా ఉంటుంది. ప్రస్తుత వరల్డ్ కప్ లో మనదేశం విజయాల ఊపుమీద ఉండగా మిగతా దేశాలు ఓటముల భారంతో ఆశలు గల్లంతు చేసుకున్నాయి.
మన దాయాది దేశం పాకిస్తాన్ అయితే భారత్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తోంది. పాక్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లాంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఐసీసీ భారత బౌలర్లపై నోరు పారేసుకుంటున్నారు. భారత్ టాస్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని పాక్ ఆటగాళ్లు ఆరోపణలు చేస్తున్నారు. కాయిన్ దూరంగా విసురుతూ మ్యాచ్ అనుకూలంగా మార్చుకుంటున్నారు.
రోహిత్ శర్మ కాయిన్ దూరంగా విసురుతున్నాడు. దాన్ని చూసే వ్యక్తి కూడా బీసీసీఐ వ్యక్తే చూస్తున్నాడు. పిచ్ ఫిక్సింగ్, టాస్ ఫిక్సింగ్, అంపైర్లను కొనడం వంటి పనులు చేస్తున్నారని పాకిస్తానీలు చెబుతున్నారు. ఇలా రోహిత్ సేనపై విమర్శలు చేస్తున్నారు. ఆట ఆడలేక లీగ్ దశలోనే నిష్ర్కమించి ఇప్పుడు భారత్ పై నోరు పారేసుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది.
ప్రతి మ్యాచ్ లో టాస్ గెలుస్తూ విజయాలు సాధిస్తుండటంపై భారత్ క్రికెట్ అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్ పై చేస్తున్న విమర్శలకు దీటైన సమాధానాలు ఇస్తున్నారు. పాక్ ఆటగాళ్ల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. చేతగాక ఇతరులపై ఆరోపణలు చేయడం వారికి తగదని హితవు పలుకుతున్నారు. వరల్డ్ కప్ లో భారత్ విజయాలను పాక్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.