Megastar Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని రెండు విభాగాల్లో విభజిస్తే మెగాస్టార్ చిరంజీవి ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానం అలాంటిది. కమర్షియల్ సినిమాల పంథానే మార్చేసిన నటుడు ఆయన. ఆయన వల్లే ఇండస్ట్రీ లో డ్యాన్స్ మరియు ఫైట్స్ లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి.
నాలుగు తరాల ఆడియన్స్ ని అలరిస్తూ, ఇప్పటికీ కూడా స్టార్ హీరోలకు సాధ్యం కాని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఆయనకీ ఉన్నన్ని వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు ఏ హీరో కి కూడా లేదు. మన టాలీవుడ్ లో రాజమౌళి కాకుండా మొట్టమొదట వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాని అందుకున్నది ఆయనే. కేవలం సినిమాల పరంగా మాత్రమే కాదు, సేవ కార్యక్రమాల్లో కూడా చిరంజీవికి సాటి ఎవ్వరూ లేరనే చెప్పాలి.
ఆయన సేవని గుర్తించే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో పద్మభూషణ్ అవార్డుని ఇచ్చింది. ఇప్పుడు ఆయనకీ దేశం లోనే రెండవ అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ని కూడా త్వరలోనే అందించనుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ముఖం లాంటి చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ ఇవ్వడం లో ఎలాంటి తప్పు లేదు. సినిమాల పరంగా, ప్రజా సేవ పరంగా చిరంజీవి చేసినంతగా ఏ హీరో కూడా చెయ్యలేదు. అనేక మంది ఆయన్ని చూసి ఆదర్శంగా తీసుకొని గొప్ప వాళ్ళు అయ్యారు. సేవ కార్యక్రమాల్లో కూడా తాను మాత్రమే సేవ చెయ్యకుండా, తన అభిమానులను కూడా సేవా కార్యక్రమం లో పాలుపంచుకునేలా చేసి, వాళ్ళను కూడా నలుగురికి ఉపయోగపడేలా చేసాడు. కరోనా సమయం లో చిరంజీవి మరియు ఆయన అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలను అంత తేలికగా మర్చిపోగలమా.
ఆక్సిజన్ బ్యాంక్స్ ని ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా ఆక్సిజన్ సీలిండెర్స్ ని అందించాడు. ఇక గత రెండు దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాన్క్ ద్వారా ఎన్నో వేలమందికి రక్తదానం, నేత్రదానం చేసాడు ఆయన. ఇక ఆపదలో ఉన్న సినీ కార్మికులను, పేద ఆర్టిస్టులను చేరదీసి వాళ్లకు ఆర్ధిక సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.