Padma Vibhushan Megastar Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి వన్నె తెచ్చిన మహానటులలో ఒకడు మెగాస్టార్ చిరంజీవి. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చేసిన లెజెండ్ ఆయన. చిరంజీవి రాకముందు తెలుగు సినిమా వేరు, చిరంజీవి వచ్చిన తర్వాత తెలుగు సినిమా వేరు. సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న దిగ్గజ నటుడు ఆయన.
మధ్యలో రాజకీయాలు అంటూ పదేళ్లు సినిమా ఇండస్ట్రీ కి దూరం అయ్యినప్పటికీ కూడా, రీ ఎంట్రీ ఇస్తే జనాలు నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. బాహుబలి తర్వాత తొలి వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన హీరో గా మెగాస్టార్ చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తనకి ఇంతటి ఆదరణ అందించిన అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళకు ఎదో ఒకటి చెయ్యాలని పరితపించే మెగాస్టార్ చిరంజీవి, ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు.
చిరంజీవి పట్టుదల, కృషి ని ఆదర్శంగా తీసుకుంటే కెరీర్ లో ఉన్నత స్థాయికి వెళ్తారు, అదే విధంగా ఆయన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజానికి ఏదైనా చేస్తే గొప్ప మనుషులు అవుతారు. అలాంటి అద్భుతం చిరంజీవి. అలాంటి మహోన్నత శిఖరం లాంటి మెగాస్టార్ చిరంజీవి కి గతం లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగాస్టార్ చిరంజీవి కి శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తుంది. చిరంజీవి కి అవార్డు వస్తే, తమకి అవార్డు వచ్చినంత సంబర పడ్డారు ఆయన తోటి నటీనటులు. కానీ ఒక్క సీనియర్ నటుడు మాత్రం అసూయ తో రగిలిపోతున్నాడట.
తాను చిరంజీవి కి పోటీ అంటూ మూడు దశాబ్దాలుగా కెరీర్ ని నెట్టుకొచ్చాడు, కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా చిరంజీవి సినిమా వసూళ్లను, ఓపెనింగ్స్ ని అందుకోలేకపోయాడు. చిరంజీవి సాధించిన విజయాలు ముందు అతను ఎందుకు పనికిరాడు, సేవ కార్యక్రమాల విషయానికి వస్తే ఇప్పటి వరకు పిల్లికి బిచ్చమ్ పెట్టినట్టు కూడా ఇండస్ట్రీ లో ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అలాంటి వ్యక్తి నేడు చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు దక్కినందుకు ఓర్వలేకపోతున్నాడట. ఇప్పటి వరకు అతని నుండి సోషల్ మీడియా లో శుభాకాంక్షల పోస్టులు కూడా పడలేదంటే మంట ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.