JAISW News Telugu

Balakrishna : పద్మభూషణ్ బాలయ్య.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్!

Balakrishna : దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ ని నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కుటుంబ సమేతంగా ఢిల్లీకి చేరుకున్నారు. సోషల్ మీడియాలో బాలయ్య ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. #PadmabhushanNBK హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమ, రాజకీయ రంగాల్లో 50 ఏళ్ల విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. గోపీచంద్ మలినేని, ఇతర ప్రముఖులు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మొత్తానికి.. “పద్మభూషణ్ బాలయ్య” అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు

Exit mobile version