Borugadda Anil Kumar : సొంత వైసీపీ నేత నోటి దురద.. అతడి ఇంటికి నిప్పు పెట్టిన వైసీపీ కార్యకర్తలు
Borugadda Anil Kumar : గుంటూరు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆఫీసు దగ్ధమైంది. తనకు తాను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్ తనకు బంధువు అని చెప్పుకుంటూ తిరిగే వాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద బూతులతో విరుచుకుపడుతూ ఉండేవారు. అదే ఇప్పుడు పార్టీకి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చిందని వైసీపీ కార్యకర్తలు అతని ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. నీ నోటి దూల వల్లే తటస్థ ఓటర్లు మన పార్టీకి దూరం అయ్యారు. పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నీలానే మరో ఇద్దరు ఉన్నారు. శ్రీరెడ్డి, ఆర్జీవీ అంటూ వైసీపీ అభిమానులు నిప్పులు చెరిగారు.
గతంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూడా ఆయన ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ సమయంలో కూడా ఆఫీసును తగల బెట్టారు. అయితే తాజాగా గుంటూరులో ఉన్న వల్లూరు వారి తోట ఆరో లైన్ లోని బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసుకు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి ఆఫీసు పూర్తిగా దగ్ధమైనట్లుగా చెబుతున్నారు. గతంలో తగలబెట్టినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆఫీసులో ఎలాంటి విలువైన సామాగ్రి ఉంచడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆఫీసును రెనోవేట్ చేస్తున్న నేపథ్యంలో లోపల సామాగ్రి అంతా బయట పెట్టారని, అయితే కొంత ఫర్నీచర్ లోపలే ఉందని చెబుతున్నారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బయటపెట్టిన ఫర్నీచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆఫీసు మొత్తం దగ్ధమైంది. పోలీసులకు సమాచారం అందించగా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.