YS Jagan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుంచి వైఎస్ జగన్ కు ఒకదాని తర్వాత ఒకటి షాక్ లు తగులుతున్నాయి. ఆయన ఆశించిన ఏ విషయంలో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే శాసనమండలిలో తమకున్న బలంతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన జగన్ కోరికకు గండి పడిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలోనే ఆయన పార్టీ ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్ క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్టితి, చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులతో జగన్ చర్చించారు. మండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉన్నప్పటికీ… త్వరలోనే కొంతమంది ఎమ్మెల్సీలు పార్టీని వీడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చెప్పినట్లు తెలుస్తోంది.
పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునే వెళ్లిపోతారు.. అలాంటి వారిని ఎంతకాలమని ఆపగలం. అది వారి ఇష్టం. విలువలు, నైతికత అనేవి ఉండాలి. వెళ్లే వారిని వెళ్లనీయండి. నిలబడాలనుకునే వారు నాతో ఉంటారంటూ జగన్ వాపోయినట్లు తెలుస్తోంది. పార్టీ పెట్టినప్పుడు అమ్మా, నేనూ ఇద్దరమే ఉన్నాం.. అయినా ఇంతదూరం వచ్చేం..ఇబ్బందేమీ లేదు. మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దాం అని జగన్ ఆవేదనతో మాట్లాడినట్లుగా సమాచారాం.
అయితే, ఎమ్మెల్సీలు ఎవరెవరు ఆయన పార్టీని వీడుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కౌన్సిల్ లో తమకున్న సంఖ్యాబలంతో రచ్చ చేద్దామనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీనేతలే చెక్ పెడుతున్నారు. జగన్ ఆవేశానికి లోనై మండలిలో రచ్చ చేద్దామనుకుంటే పరిస్థితులు మాత్రం ఆయనకు పూర్తి విరుద్ధంగా మారాయంటూ ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా వైసీపీ ఓటమికి కారణమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి వంటి కీలక బిల్లులను కూటమి సర్కార్ తీసుకురానుంది. వీటికి శాసనమండలిలో వైసీపీ అడ్డు తగలడం ఖాయమే. ఇలాంటి బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని భావించి వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే చాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఎంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ కండువా కప్పుకుంటారు. శాసనమండలిలో అనర్హత వేటు పడకుండా వారు ఏం చేయబోతున్నారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.