JAISW News Telugu

Overnight Millionaire : రాత్రికి రాత్రే రూ. 45 కోట్లు.. UAEలో కోటీశ్వరుడైన ప్రవాస భారతీయుడు

Overnight Millionaire

Overnight Millionaire

Overnight Millionaire : కిస్మత్ ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో చెప్పడం సాధ్యమే కాదు. ఒక్క గడియ లోనే కుబేరుడిని భిక్షగాన్ని చేయగలదు.. అదే ఒక్క గడియలోనే భిక్షగాన్ని కుబేరుడిని చేయనూ గలదు. ఎంతో మంది ఒక్క రోజు (రాత్రి, పగలు)లోనే కోట్లాది రూపాయలకు అధిపతిగా మారారు. వారు చేసింది చూస్తే కొంత జలసీ ఫీలయినా ఆశ్చర్యం మాత్రం అనిపిస్తుంది. ఒక వ్యక్తి లైఫ్ రాత్రికి రాత్రి మారిపోయింది. అప్పట్లో ఓనం లాటరీ ఒక ఆటో డ్రైవర్ కు తలిగింది. ఇంకే ముంది ఒక్క రోజులోనే ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. ఇతా తమకు కూడా అదృష్టం కలిసి రాకుండా పోతుందా అనుకొని ఒకటికి రెండు లాటరీ టికెట్లు కొని పెట్టుకునే వారు ఉంటారు.

అదృష్టం ఉంటే ఇక్కడా.. అక్కడా.. అనే తేడా లేదులే. ఏ మూలన ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా వెతుక్కుంటూ వస్తుంది. జుజైరహాలో ఉండే ప్రవాస భారతీయుడికి లాటరీలో ఏకంగా రూ. 45 కోట్లు వచ్చాయి. ఇంకేముంది లైఫ్ టైమ్ కూర్చోని తిన్నా తరగతి సంపాదన ఒక్క రాత్రిలోనే మనోడి సంబురం మామూలుగా లేదుగా.. ఆ దేశంలో ఏర్పాటు చేసిన ‘మహజూజ్ రాహెల్ డ్రా’ లో ప్రవాసుడికి జాక్ పాట్ దక్కింది. కేరళ నుంచి వలస వెళ్లిన వ్యక్తికి అక్కడి లాటరీలో 20 మిలియన్ దిర్హామ్స్ దక్కించుకున్నాడు. భారత కరెన్సీ ప్రకారం రూ. 45 కోట్లు.

కేరళ కు చెందిన శ్రీజు UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)కి వలస వెళ్లాడు. ఆ దేశంలోని జుజైరహాలోని గ్యాస్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీలో టెక్నీషియన్ పని చేస్తున్నాడు. అక్కడ ఏటా అతిపెద్ద లాటరీ నిర్వహిస్తారు. అదే ‘మహజూజ్ డ్రా’. లక్ ఉంటే అందులో ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకున్న ఆయన మూడేళ్లుగా లాటరీ కొంటూ వచ్చాడు. ఆయన అదృష్టం ఫలించి లాటరీ తగిలింది. ఆదివారం (నవంబర్ 19) తీసిన డ్రాలో శ్రీజు 20 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకున్నాడు.

ఇంత పెద్ద మొత్తం ఒకే సారి రావడంతో శ్రీజు ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న దానికి ఇప్పుడు ప్రయోజనం దక్కిందని అన్నాడు. తనకే లాటరీ వచ్చిందని చెప్తే అస్సలు నమ్మబుద్ది కాలేదని రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్తేనే నమ్మినట్లు చెప్పాడు. ఈ డబ్బుతో సొంత గ్రామంలో ఇళ్లు కొంటానని చెప్పాడు.

Exit mobile version