Outer ring Road : ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ, బఠాణీల్లా అమ్మారు: సీఎం రేవంత్ రెడ్డి

Outer ring Road
Outer ring Road : ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ, బఠాణీల్లా గత ప్రభుత్వ హయాంలో అమ్మారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతే ఉందన్నారు. గొర్రెలు, బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. సూరత్ నుంచి నాసిరకం చీరలు తెచ్చి పంచారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు అమ్మారని తెలిపారు. కట్టడాల లెక్కల గురించి హరీశ్ చెబుతున్నారు, అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డును పల్లీ బఠాణీలు అమ్మినట్లు అమ్మారని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రజలు ఏం పాపం చేశారని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కన్న రాష్ట్రం వచ్చాక ఎక్కువ జరిగిందని పేర్కొన్నారు.