JAISW News Telugu

Team India : బీసీసీఐ ఇచ్చిన 125 కోట్లలో టీమిండియా క్రికెటర్లు, కోచ్, సిబ్బందికి ఎంత మొత్తం అంటే?

Team India

Team India

Team India : టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ జయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ టోర్నీల్లో ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించి సగర్వంగా ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ను టీం ఇండియా అందుకుంది. ప్రపంచ కప్ గెలిచిన టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ. 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ముంబయి వేదికగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇచ్చింది.

అయితే టోర్నీ విజేతకు ఐసీసీ రూ. 20 కోట్లు ఇవ్వగా.. దానికి ఏడింతలు ఎక్కువగా బీసీసీఐ అవార్డు ఇవ్వడం గమనార్హం. ఈ 125 కోట్ల ప్రైజ్ మనీలో 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ. 5 కోట్ల చొప్పున రాగా..  కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా రూ. 5 కోట్లు అందనుంది.  దీంతో పాటు టీంతో కొనసాగిన మిగతా కోచ్ లకు రూ. 2.5 కోట్లు, బ్యాక్ రూమ్ స్టాప్ (సహాయక బృందానికి) రూ. 2 కోట్లు, రిజర్వ్ ప్లేయర్లు, బీసీసీఐ సెలక్టర్లకు రూ. కోటి చొప్పున అందనుంది.

ఇప్పటికే ఈ 125 కోట్లను బీసీసీఐ ముంబయి లోని వాంఖడే స్టేడియంలో గెలుపు సంబరాల్లో భాగంగా కెప్టెన్ రోహిత్ కు అందించింది. ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్ల పర్ఫామెన్స్ ను బట్టి వారికి అవార్డులను అందజేస్తూ ఉంటుంది.  టీ 20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు సభ్యుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్లు విరాట్ కొహ్లి, రవీంద్ర జడేజాలు టీ 20 లకు రిటైర్ మెంట్ ప్రకటించారు.

కాగా జింబాబ్వే సిరీస్ కు యువ టీ 20 టీమ్ ను బీసీసీఐ పంపింది. ఈ టీమ్ కు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. మొదటి టీ 20 లో యువ జట్టు ఓడిపోగా.. రెండో మ్యాచ్ లో మాత్రం చెలరేగి ఆడి 100 పరుగుల తేడాతో జింబాబ్వే ను మట్టి కరిపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 100 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపించాడు.

Exit mobile version