Citadel-Honey Bunny : ఓటీటీ రివ్యూ: సిటాడెల్-హనీ బన్నీ హిట్టా-ఫట్టా

Citadel-Honey Bunny

Citadel-Honey Bunny

Citadel-Honey Bunny :  యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి స్పై థ్రిల్లర్‌ సినిమాలు చాలా నచ్చుతుంటాయి. అలాగే రా ఏజెంట్లు, విలన్ల ఎత్తుకు పై ఎత్తులు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఇండియన్‌ ఆడియన్స్‌ను ఆకట్టకుకునేందుకు వచ్చిన స్పై థ్రిల్లర్‌ సిటాడెల్‌ :  హనీ-బన్నీ.  స్టార్‌ హీరోయిన్‌ సమంత, బాలీవుడ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై థ్రిల్లర్‌ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇదీ కథ..

హనీ(సమంత) సీక్రెట్‌ ఏజెంట్‌. తనకు అప్పగించిన మిషన్‌ ను పూర్తి చేసేందుకు నటిగా మారుతుంది. ఆమెకు ఓ కూతురు ఉంటుంది.  రాహీ గంభీర్‌(వరుణ్‌  ధావన్‌) కూడా  ఓ సీక్రెట్‌ ఏజెంట్‌. రాహీ కూడా తన మిషన్‌ లో భాగంగా స్టంట్‌ మేన్‌(బన్నీ)గా  అవతారమెత్తుతాడు. హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి విశ్వ అనే కోడ్‌ పేరుతో పని చేసే జగన్‌(కేకే మీనన్‌) వద్ద సీక్రెట్‌ ఏజెంట్లుగా పని చేస్తుంటారు. వీరికి ఇచ్చిన మిషన్‌ ఏమిటంటే  డేవిడ్‌ అనే విలన్‌ వద్ద ఉన్న డిస్క్‌ దొంగలించడం.  మరి వారి టాస్క్‌ పూర్తయ్యిందా? వీరి టాస్క్‌ పూర్తి చేసేందుకు ఏమేం చేశారు. వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు వీరిద్దరూ సినిమా రంగంలోనే చెరో డిపార్ట్‌మెంట్‌ను ఎందుకు ఎంచుకున్నారు? విశ్వ కోడ్‌ తో చేపట్టిన టాస్క్‌ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

విలన్‌ డేవిడ్‌  కళ్లు గప్పిఅతని వద్ద ఉన్న డిస్క్‌ను సొంతం చేసుకోవాలనే ప్లాన్‌ తో సీక్రెట్‌ ఏజెంట్‌ హానీ(సమంత)ని పంపించాలనే పాయింట్‌ తో కథ మొదలవుతుంది. కానీ ఈ పాయింట్ చుట్టూ రాసుకున్న యాక్షన్‌ సీక్వెన్స్‌ అంతగా పండలేదు. సమంతకు జరిగిన యాక్సిడెంట్‌ తో కథ ప్లాష్‌ బ్యాక్‌ లోకి వెళ్తుంది.  అప్పటికే  ఏజెంట్‌ అయిన బన్నీతో హీరోయిన్‌ పరిచయం, లవ్‌ స్టోరీ యూత్‌ ను ఆకట్టుకుంటుంది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న హనీ సీక్రెట్‌ ఏజెంట్‌గా  ఎలా మారిందో చూపించే విధానం ఆకట్టుకుంది.

ఈ కథ రెండు కాలాల మధ్య సాగే టైమ్‌ ప్రేమ్‌ లో చూపించే విధానం చాలా బాగుంది. దర్శకుడు రెండు టైమ్‌ ఫ్రేమ్‌ లను ఆసక్తికరంగా చూపించడంలో  సక్సెస్‌ అయ్యాడనే  చెప్పవచ్చు .

సిటాడెల్: హనీ బన్నీ’ కథ రెండు టైమ్ ఫ్రేమ్‌లలో సాగుతుంది.

ప్రధానంగా ముంబై,  బెల్‌గ్రేడ్ (గతంలో) 1997లో, నైనిటాల్, ముంబై, హైదరాబాద్ (ప్రస్తుతం) 2000లో సాగుతుంది.

సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్ కలుసుకోవడం, ఏజెంట్లుగా మారడం, ప్రేమలో పడటం, విడిపోవడం ఫ్లాష్‌ బ్యాక్‌ లో నడుస్తుంది.  ప్రస్తుతం వారు ఒకరినొకరు మళ్లీ కలుసుకోవడం,  తమ కూతురు నదియాను కాపాడుకోవడం చాలా ఆసక్తి కరంగా సాగుతుంటుంది.   యాక్షన్‌ డ్రామా చాలా బాగుంది.

నటీనటుల పెర్ఫామెన్స్‌

సీక్రెట్‌ ఏజెంట్‌గా, లవర్‌గా, తల్లిగా మూడు వేరియేషన్లలో సమంత నటన నిజంగా అద్భుతమనే చెప్పాలి. యాక్షన్‌ సీన్లలో అలవోకగా నటించి మెప్పించింది సమంత. ఇక అదే సమయంలో  వరుణ్‌ తో రోమాన్స్‌ కూడా చాలా బాగా పండించింది.   సమంత-వరుణ్‌ లిప్‌ లాక్‌ సీన్లతో యూత్‌కు ట్రీట్‌ ఇచ్చారు. అటు వరుణ్‌ ధావణ్‌ కూడా స్టంట్‌ మేన్‌గా, ఇటు తండ్రిగా భావోద్వేగాలను చాలా బాగా పండించాడు.కూతరు క్యారెక్టర్‌ నదియా చాలా బాగా చేసింది.  మిగతా పాత్రధారులు వారి పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు

అమన్ అమంత్ బీజీఎం చాలా బాగుంది.  ఇక సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.   హాలీవుడ్‌ సిటాడెల్‌ కథను భారతీయ నేటివిటికీ తగ్గట్లుగా మార్చిన విధానం చాలా బాగుంది.

ప్లస్‌ పాయింట్లు

కథ

సమంత

వరుణ్‌ ధావన్‌

మ్యూజిక్‌

దర్శకులు రాజ్ & డీకే టేకింగ్‌

మైనస్‌ పాయింట్లు

అక్కడక్కడా బోరింగ్‌

కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా లేకపోవడం.

రేటింగ్‌ :  3/5

ఒక్క మాటలో చెప్పాలంటే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారు కచ్చితంగా చూడాల్సిన సినిమా.

TAGS