Indian 2 : ఇండియన్ 2ను తిరస్కరిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫారాలు.. ఇది శంకర్ కు తలవంపులేనా?

Indian 2

Indian 2

Indian 2 : కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ మూవీ భారీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే ఈ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దేశీయంగా కేవలం 85 కోట్లు, ఓవర్సీస్ లో 50 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 135 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ 70 కోట్ల లోపే. 250 కోట్ల భారీ నిర్మాణ బడ్జెట్ కు ఇది చాలా దూరం. ఇది నిర్మాతకు విపరీతమైన నష్టాలను కలిగించింది. ఈ చిత్రం ఫెయిల్ కావడంతో ఇండియన్ 2 కోసం ముందుగానే ఓటీటీలో విడుదల చేయాలని ప్రాథమిక నివేదికలు సూచించాయి. థియేటర్లలో రిలీజ్ చేయడంతో డిజాస్టర్ టాక్ ఎదుర్కొంది. ఈ చిత్రం నిరాశాజనకంగా ఉండడంతో ఓటీటీ విడుదలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదట్లో ఇండియన్ 2 స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ 100 నుంచి 120 కోట్ల వరకు చెల్లించి దక్కించుకుంది.

అయితే నెట్ ఫ్లిక్స్ గణనీయమైన రీఫండ్ కోరుతోంది. గతంలో అంగీకరించిన 120 కోట్ల ఒప్పందం ప్రకారం చెల్లించేందుకు ఇష్టపడటం లేదు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఒక సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ను బట్టి ఫైనల్ డీల్స్ సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నెట్ ఫ్లిక్స్ ఇండియన్ 2 నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదల ఆలస్యమవుతోందని సమాచారం.

ఇండియన్ 2ను ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా రిలీజ్ చేసేందుకు నిరాకరించడం శంకర్ లాంటి పెద్ద దర్శకుడికి మరో దెబ్బ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడం. ఓటీటీ విడుదలలో ఎదురైన చిక్కులు శంకర్ కు చాలా ఇబ్బంది కలిగించాయి. ఎందుకంటే అతను ఎప్పుడూ అలాంటి తిరస్కరణను ఎదుర్కోలేదు. గేమ్ ఛేంజర్ తో శంకర్ రీఎంట్రీ ఇస్తాడని, తన బ్రాండ్ ను పునరుద్ధరించి, తన గత చిత్రాలు సాధించిన విజయాన్ని అందించాలని అభిమానులు, ఇండస్ట్రీ పరిశీలకులు ఆశిస్తున్నారు.

TAGS