JAISW News Telugu

Rajamouli Couple : రాజమౌళి దంపతులకు.. ఆస్కార్ అకాడమీ ఆహ్వానం

Rajamouli Couple

Rajamouli Couple

Rajamouli Couple : దర్శక ధీరుడు రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళిలకు అరుదైన గౌరవం దక్కింది. వీళ్లు ఆస్కార్స్ తీసుకోవడం కాదు.. ఎవరికి ఇవ్వాలో చెప్పే అకాడమీలో చోటు దక్కించుకున్నారు. దర్శకుల కేటగిరీలో రాజమౌళికి, కాస్ట్యూమ్ డిజైనర్స్ కేటగిరీలో రమా రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులను ఆహ్వానించగా, అందులో ఇండియా నుంచి ఈ ఇద్దరితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ఈ జాబితాను అకాడమీ తమ అధికారిక వెబ్ సైట్ లో పబ్లిష్ చేసింది.

డైరెక్టర్స్ జాబితాలో రాజమౌళిని ఆహ్వానిస్తూ ఆర్ఆర్ఆర్, ఈగ సినిమాలను అతడు డైరెక్టు చేసినట్లు చెప్పారు. రమా రాజమౌళి గురించి చెబుతూ ఆమె ఆర్ఆర్ఆర్, బాహుబలి ది బిగినింగ్ మూవీకి పని చేసినట్లుగా చూపించారు. ఈ ఇద్దరితో పాటు ఇండియా నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, రవి వర్మన్, రీమా దాస్, షీతల్ వర్మ, ఆనంద్ కుమార్ టక్కర్, నిసా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలాంటి వాళ్లు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేరనున్నారు.

Exit mobile version