Amaravati : అమరావతి చుట్టూ ORR షురూ! రాష్ట్రంలో మూడేళ్లలో పూర్తి కానున్న ఎక్స్ ప్రెస్ హైవేలు
Amaravati : మాజీ సీఎం జగన్ అమరావతిని ఓ శిథిల నగరంగా మార్చేసి, తాను బాబుపై ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషించారే తప్ప ఏపీకి తీరని ఆర్థిక, పారిశ్రామిక నష్టం కలుగుతోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఓ సీఎంగా జగన్ చేసిన ఈ తప్పు ఏపీలో ఎప్పటికీ మిగిలిపోతోంది.
ఆ తప్పును చంద్రబాబు సీఎం కాగానే సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి అమరావతి చుట్టూ 189 కిమీ పొడవునా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ కోసం రూ.20,000- రూ. 25,000 కోట్లు ఆర్ధిక సాయం సాధించారు.
అమరావతిని చంద్రబాబు నాయుడు డిజైన్ చేయించినప్పుడే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మూడు ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా రాష్ట్రంలో కడప, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ హైవేలు వచ్చేవి. కానీ బాబుపై ద్వేషం, కక్షతో జగన్ ఆ పనులన్నిటినీ పక్కన పడేశారు.
ఇదీ ఒకందుకు మంచిదే. అవి కూడా జగన్ చేతిలో పడి ఉంటే పనులు పూర్తికాకపోగా అవినీతి, అక్రమాలకు పాల్పడి ఉండేవారు. వైసీపి నేతలకు లబ్ధి కలిగేలా రోడ్లు మెలికలు తిప్పి అంచనాలను పెంచేసేవారు. దీనికి ఉదాహరణే అమరావతి-అనంతరం యాక్సస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 6 లైన్లతో 393 కి.మీ. పొడవుగా ఉండే ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తే, జగన్ వచ్చాక పులివెందులవైపు తిప్పుకున్నారు.
కనుక జగన్ ఏ కారణంతో వాటిని పక్కన పడేసినా ఇప్పుడు చంద్రబాబు ముందుగా అనుకున్నట్లే అన్నీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ప్రారంభించే ఎక్స్‌ప్రెస్ హైవేలు 3 ఏళ్లలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయ్యేలోగా అమరావతిలో నిర్మాణాల రూపురేఖలు మారుతుంటాయి. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఏపీకి ఓ అద్భుతమైన రాజధాని నగరం, సువిశాలమైన ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్లు ఉంటాయి. వాటితో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి.
రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు, ఔటర్ రింగ్ రోడ్డు పనులు, మౌలిక వసతుల కల్పన పనులతో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే బాబు పేరు మరోసారి మార్మోగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకున్న జగన్ దురదృష్టవంతుడే కాదా?