Crickter Azam : ఒరేయ్ ఆజామూ.. ఇక నీ కెరీర్ గోవిందా !
Crickter Azam : పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజంకు కొంత కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. దాదాపు రెండేళ్లుగా బ్యాట్స్ మెన్ గా వరుసగా విఫలమవుతున్నాడు. పాక్ బ్యాటింగ్‌కు ఆయువుపట్టుగా ఉన్న బాబర్ ఆజం ఇప్పుడు ఏకంగా జట్టుకే దూరమయ్యాడు. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. జట్టును ఆదుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా ఆడి తీవ్ర విమర్శల పాలయ్యాడు. దీంతో ఇంగ్లండ్ తో జరిగే రెండో టెస్టుకు సంబంధించి పీసీబీ కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. జట్టు మార్పులు-చేర్పుల్లో భాగంగా ఏకంగా బాబర్ ను పక్కన పెట్టేసింది. బాబర్ ఆటతీరుపై టీమ్ మేనేజ్ మెంట్ మండిపడుతునన్నది. తన స్థాయికి తగ్గట్లుగా ఆడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
9 టెస్టుల్లో విఫలం
టెస్టు క్రికెట్‌లో బాబర్ ఆజం పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బాబర్ 2023 ప్రారంభం నుంచి ఆడిన 9 టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 20.71 సగటుతో 352 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టెస్టు క్రికెట్‌లో గత 18 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ ఆజామ్ ఒక్కసారి కూడా 50 పరుగులు సాధించలేకపోయాడు. ఈ టాప్ బ్యాట్స్ మెన్ అత్యధికంగా 79 బంతులు ఎదుర్కొని కేవలం 41 పరుగుల వద్ద ఆగిపోయాడు.
రెండేళ్లుగా ఒక్క సెంచరీ లేదు.
డిసెంబర్ 2022లో కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో బాబర్ ఆజాం చివరిసారిగా సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో బాబర్ 161 పరుగులు చేశాడు. ఆ తర్వాత నుంచి విఫలమవుతూనే ఉన్నాడు.
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
బాబర్ కు ఉద్వాసన తప్పదని స్పష్టం కావడంతో పాక్ నెటిజన్లు బాబర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని కాపాడుకోలేకపోయారు. కెప్టెన్సీని నిలబెట్టుకోలేకపోయావు.. ఒక్క మ్యాచ్ కూడా సరిగా ఆడడం లేదు. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పేయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.