JAISW News Telugu

YS Jagan : ప్రశ్నిస్తానన్న భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: వైఎస్ జగన్

YS Jagan

YS Jagan

YS Jagan : ప్రశ్నిస్తానన్న భయంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదని ఆ పార్టీ నేత వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకు కూడా గడవక ముందే రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తమ పార్టీ నాయకులపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై ఢిల్లీలో నిరసన స్వరం వినిపించడానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నవారు. ఈరోజు (సోమవారం) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 50 రోజుల్లోనే అన్నింటా వైఫల్యం చెందిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందని అన్నారు. ఈ ఏడాది అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనంతగా ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో అధికార పక్షం. మరొకటి ప్రతిపక్షం మాత్రమే ఉన్నాయని, ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్షనేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న బయంతోనే.. తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం లేదని జగన్ ఎక్స్ లో పేర్కొన్నారు.

Exit mobile version