Mallikarjun Kharge : రాజ్యసభలో ప్రధాని మోదీపై విపక్ష నేత ఖర్గే ఫైర్

Mallikarjun Kharge
Mallikarjun Kharge : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధాన మంత్రి మోదీ తీరుపై కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. ‘‘లోక్ సభ ఎన్నికల ప్రసంగాల్లో పీఎం మోదీ విద్వేషాలు రెచ్చగొట్టారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బీజేపీకి సరైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంగళసూత్రాలు అమ్మేస్తారని మోదీ తప్పుడు ప్రచారం చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి విద్వేష ప్రసంగాలు చేయడం సరికాదు. ఓటర్లను పీఎం మోదీ అవమానించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం. మహిళలు, దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు’’ అని అన్నారు.
ఖర్గే వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుపట్టింది. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ జేపీ నడ్డా ఛైర్మన్ ను కోరారు. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. దీనికంటే ముందు లోక్ సభలో నీట్ పరీక్షపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్ పై లోక్ సభలో చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.