Agricultural Practices : వ్యవసాయ విధానాలు మారినప్పుడే.. రైతు రాజు అవుతాడు: యం.వి.రామారావు
Agricultural Practices : హరిత విప్లవ పితామహుడు డా.స్వామినాధన్ సిఫార్సు ల అమలుతో పాటు వ్యవసాయ విధా నాలు పూర్తిగా మారినప్పుడే రైతు రాజవుతాడనీ సీనియర్ జర్నలిస్ట్ యం.వి.రామా రావు తెలి పారు. మార్కెట్ వ్యవస్థను స్ధిరీకరించ కుండా కనీసమ ద్దతుధర పంటలకు ఇచ్చినా ఫలితం ఉండదన్నారు. దళారులు దాన్ని కైవసం చేసుకో కుండా కట్టుదిట్ట మైన విధానాలు రూపకల్పన చేయాలి.మద్దతుధర నేరుగా రైతుకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనీ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రైతుతో పాటు వినియోగదారుడి ప్రయోజనాలు నేరవేరాలంటే వ్యవసాయ విధానాలను ప్రభుత్వం మార్చుకోవాలి. విదేశీ ప్రభుత్వాలు రైతుకు సబ్సి డీల రూపంలో ఎరువులు,విత్తనాల వంటివి సరఫరా చేస్తారు. ప్రభుత్వాలు నిధులు బ్యాంక్ ల్లో వేయడం వల్లఅసలు రైతుకు అందడంలేదు.
రైతు ఆరుగాలం కష్టపడి పంటనుపండిస్తే సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడంతో పంట దళారులపాలవుతున్నది. రైతు తాను పెట్టిన పెట్టుబడి కోసం,కుటుంబ అవసరాలకు పంటను కళ్లంలోనే తెగనమ్ముకుంటాడు.
రైతు నుంచి దళారికి ధాన్యం చేరడంతోనే ధరలు పెరుగుతాయి. బస్తాకు రెండు నుంచి మూడు వం దలరూపాయల వరకూ పెరుగుతాయి. రైతు గాని, కౌలురైతుగాని నిలువ ఉంచుకుని అవకాశం ఉండ దు.ఖర్చులు వెంటాడతా యి. కనీసం తాను పం డించిన పంటతినేందుకైనా ఉంచుకోడు. కనీసమ ద్దతు ధర తో పాటు,మార్కెట్ స్ధిరీకరణ చేస్తే రైతుకు కొంత ఊరట లభిస్తుంది.
కనీసమద్దతుధరపై కమిటి వేస్తానని కేంద్రం ఇచ్చిన హామీ నేరవేరకపోవడం వల్ల పంజాబ్,హర్యానా తదితర రాష్ట్రాల రైతులు మళ్లీ ఉద్యమాల బాట పట్టారు. మార్కెట్ వ్యవస్థ ప్రభుత్వ అజమాషిలో ఉండాలి.అధికారులు అవినీతికి పాల్పడకుండా విజిలెన్స్ ఉండాలి. రైతుకు మేలైన విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాయి. కాని అవి రైతులకు అందుతున్నాయా లేదా అనే ఆరా లేదు.నేడు గ్రామాల్లో 80శాతం భూములను కౌలురైతులు సాగు చేస్తున్నారు.
కాని డబ్బులు భూమి పేరున్న రైతు ఖాతాలో పడుతున్నది. కౌలురైతుకు చేరడంలేదు.కౌలు రైతుల గుర్తింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.కేవలం ప్రకటనలకే పరిమితం అవుతు న్నాయి.అలాగే ధాన్యం కొనుగోలు సమయంలో గ్రామాల్లో ధాన్యం కొనుగొళ్ల కేంద్రాలు తెరవాలి. ధాన్యం కొనుగొలుధరల్లో సబ్సిడీ ఇవ్వవచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోకుండా కనీసమద్దతు ధర ఇచ్చినా ఫలితం ఉండదని వ్యవసాయశాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఏదిఏమైనా మద్ధతుధర తో పాటు రైతుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలి.
ధనం రూపంలో కాకుండావిత్త నాలు,ఎరువు లు,పురుగుమందులు వంటి రూపంలో ఇవ్వా లి.అవి నాణ్యమైనవిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. పంటలబీమా తప్పనిసరిగా ప్రతిరైతుకు వర్తించేలా చర్యలు తీసుకోవాలి. సున్నా వడ్డీ కి స్వల్పకాలిక రుణాలు రైతుల కు(కౌలు)ఇవ్వాలి.కేంద్రరాష్ట్
పెరుగుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వంగడాలు రూపకల్పన చేయాల్సి ఉంది.నీటిపారుదల సౌకర్యాలు,సాగునీరు సక్రమంగా అందేలా తగిన పథకాలు రూపకల్పన చేయాలి.అప్పుడే అన్నదాత ఆత్మహత్య లేని భారతం సిద్ధిస్తుంది.బియ్యం,గోధుమలు కొనే వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుంది.
(యం.వి.రామారావు,సీనియర్ జర్నలిస్టు)