Own Pin Code : మనదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక్కో నెంబర్ తో పిన్ కోడ్ ఉంటుంది. తెలంగాణలో 5తో మొదలవుతుంది. కానీ దేశంలో ఇద్దరు వ్యక్తులకు మాత్రం సొంత పిన్ కోడ్ కలిగి ఉంటారు. అందులో రాష్ట్రపతి ఒకరు. మరో వ్యక్తి అయ్యప్ప స్వామి. వీరికే ఎందుకు ప్రత్యేకత పిన్ కోడ్ ఉంటుందంటే అది ఎవరో ఇచ్చింది కాదు. వారికి సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తోంది.
భారత ప్రథమ పౌరుడెవరంటే రాష్ట్రపతి అని తెలుసు. అందుకే ఆయనకు ప్రత్యేక పిన్ కోడ్ ఉంటుంది. అది ఆయన ప్రత్యేక పిన్ కోడ్. అయ్యప్ప స్వామి పిన్ కోడ్ 689713. ఇది సన్నిధానం పోస్టాఫీస్ పిన్ కోడ్. సంవత్సరంలో మూడు నెలల కాలం మాత్రమే చురుకుగా పనిచేస్తుంది. పండగ సీజన్ తరువాత మనుగడలో ఉండదు. పిన్ కోడ్ నిష్ర్కియగా మారుతుంది.
ఈ కార్యాలయం మండల మకర విలక్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాంతం పోస్టల్ స్టాంపులో పదునెట్టుపడి, అయ్యప్ప విగ్రహం ఉంటాయి. దేశంలోని మరే ఇతర పోస్టల్ డిపార్ట్ మెంట్లలో ఇలాంటి ప్రత్యేకతలు ఉండవు. చాలా మంది యాత్రికులు సన్నిధానం పోస్టాఫీసును సందర్శిస్తుంటారు.
ఈ స్టాంపు లేఖలను వారి ఇళ్లకు ప్రియమైన వారికి పంపడానికి పండగ సీజన్ తరువాత ఈ స్టాంపు పతనం తిట్ట పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలోని లాకర్ కు బదిలీ చేస్తారు. అప్పుడు ఈ ముద్ర వచ్చే పండగ సీజన్ లో వెలుగు చూస్తుంది. ఇలా పోస్టల్ శాఖకు ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించి స్వామి వారి కానుకలను తీసుకుంటుంటారు.