CM Chandrababu : ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత: సీఎం చంద్రబాబు
CM Chandrababu : భవిష్యత్తుల యువత తగ్గుతుందని అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న (సోమవారం) ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన, పాపులేషన్ మేనేజ్ మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతారని వ్యాఖ్యానించారు.
గతంలో కూడా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలాంటి కుటుంబ ప్రణాళికా విధానాల్లో మార్పులకు పిలుపునిచ్చారు. అప్పట్లో ఎక్కువ మంది పిల్లలను కలిగిన దంపతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు దేశంలో జనాభా నియంత్రణలో కీలక పాత్ర పోషించాయి. అయితే, 2026 తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల పునర్నిర్ణయం జరిగే సమయంలో ఈ రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిథ్యం తగ్గపోయే అవకాశాలు ఉన్నాయని పలు వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.