Samantha : అప్పుడే వారికి సమాధానం చెప్పొచ్చు..! సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha

Samantha

Samantha : సమంత పేరు తెలియని సగటు సినీ లవర్ లేదంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయమే కాకుండా క్యారెక్టర్‌ రైజేషన్ తో కూడా అభిమానులను రోజు రోజుకు దగ్గరైంది. నాగ చైతన్యతో విడాకులు మయోసైటిస్ నిర్ధారణ లాంటి కఠిన సందర్భాల్లో సైతం ఆమె ధైర్యంగా నిలబడిన విధానం అందరికీ స్ఫూర్తినిచ్చింది. కెరీర్ పరంగా కూడా ఒడిదుడుకులను తట్టుకోవడం విషయంలో ఆమె స్ఫూర్తిగా నిలుస్తుంది.

తనను తాను మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకు సాగింది. మయోసైటిస్‌ తర్వాత సినిమాలను తగ్గించుకుంటూ వచ్చింది. ఒక దశలో ఇక వీడ్కోలు చెప్తుందని అందతా అనుకున్నారు. కానీ  సిటాడెల్‌: హనీ బనీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సమంత యాక్షన్‌ సన్నివేశాలు సగలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్‌ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమా వివరాలతో పాటు, వ్యక్తి గత విశేషాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది సామ్‌.

ఈ క్రమంలోనే ఇన్‌ స్టా వేదికగా ఓ ఒక పద్యాన్ని షేర్‌ చేసింది. ‘ఈ పద్యం నాకు మార్గదర్శకంగా ఉందని, ఈ దీన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ చెప్పింది. ఇంతకీ ఈ పద్యం అర్థం ఏంటంటే. ‘మీరు రిస్క్‌ తీసుకొని ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే.. మళ్లీ మీ ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. అంతేగానీ.. ఓటమిని ఆలోచిస్తూ కూర్చోవద్దు. మనలను మనం స్ట్రాంగ్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్లాలి. మీ దగ్గరం ఏం లేకపోయినా సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు నిందించేవారికి సమాధానం చెప్పొచ్చు’ అనే అర్థం ఈ పద్యంలో ఉంది.

సమంత పోస్ట్‌ చేసిన ఈ పద్యం వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌ చూసిన అభిమానులు ఆమెకు మద్ధతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. సామ్‌ కెరీర్‌ విషయానికస్తే సిటాడెల్‌: హనీ బనీ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సామ్‌ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తుండడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

TAGS