JAISW News Telugu

Pawan Kalyan : ప్రత్యర్థులను పలకరించడంలో పవన్ తర్వాతే ఎవరైనా..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : కూటమి ప్రభుత్వంలో ఎంత మంది ఉన్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం అందరిలో ఒక్కరు కాదని చెప్పవచ్చు. ఆయన కామెంట్స్, ఆయన ప్రత్యర్థులతో వ్యవహరించే తీరు.. అధినాయకులతో కలిసిపోయే తీరు ప్రతీ ఒక్కటీ హైలైట్ అని చెప్పవచ్చు. పగవాడైనా పలకరిస్తే స్పందించాలని పెద్దలు చెప్పిన మాటలను పవన్ కళ్యాణ్ తూచా తప్పకుండా పాటిస్తుంటాడు. ప్రభుత్వం తనదే అయినా.. వెనకేసుకువచ్చే విధానం కాదు ఆయనది. తన పార్టీకి చెందిన హోం మినిస్టర్ పై సైతం ఆయన తీవ్రంగా స్పందించారు. మహిళల విషయంలో తనను సైతం ఉపేక్షించద్దని సూచించాడు.

ఇదంతా ఒకెత్తయితే.. ప్రత్యర్థి పార్టీ నేతలతో ఆయన మెలిగే విధానం మరో ఎత్తు. ప్రత్యర్థి అంటేనే అపోజిట్ర.. పగవాడు.. అనే అర్థం కదా.. అయినా వారితో హుందాగా వ్యవహరిస్తూనే ప్రేమతో పలుకరిస్తారు డిప్యూటీ సీఎం. ఇటీవల అమరావతి అసెంబ్లీ ఆవరణలో వింతైన విషయం కనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లింది. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించినప్పటి నుంచి వైసీపీ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన కూడా కొన్ని పట్టించుకొని కౌంటర్ ఇవ్వగా.. మరికొన్ని పట్టించుకోలేదు.. అయినా బొత్స మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక గెలిచిన తర్వాత ఎవరూ ఎవరిని పట్టించుకోలేదు ఇది వేరే విషయం అనుకోండి.

కానీ, తనను తన కుటుంబాన్ని సైతం ధూషించిన వైసీపీ నాయకులను కూడా పవన్ కళ్యాన్ ప్రేమగా పలకరించారు. ఉపముఖ్యమంత్రి పవన్  కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండడంగా ఎదురుగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఉన్నారు. పవన్ ఆయనను చూసి అక్కడికి వరకు నడుచుకుంటూ వెళ్లి పలకరించారు. అయితే పవన్ రాకను చూసి పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు దూరంగా వెళ్లిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ కు నమస్కారం పెట్టిన బొత్సను నవ్వుతూ పలకరించారు. పవన్ కళ్యాణ్ తనవైపు వస్తుండడం చూసి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాద పూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి వెళ్లాడు. జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచీ చూస్తూ అయోమయంలో పడ్డారు వైసీపీ నేతలు..

Exit mobile version