Supreme Court Green Signal : ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లు కేవలం పావులుగానే మారుతున్నారు. ఐదేళ్లకోసారి అంగడి బొమ్మల్లా మారుతున్నారు. ఓట్ల కోసమే మనల్ని పార్టీలు వినియోగించుకుంటున్నాయి. ఉచిత పథకాల పేరుతో దగా చేస్తున్నాయి. ఉచితాలు మన మనుగడకే ఎసరు పెడతాయనే విషయం చాలా మందికి తెలియదు. శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు ఇలాంటి ఉచితాలు ఇచ్చే ఇప్పుడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈనేపథ్యంలో ఉచితాలు ఇస్తామనే పార్టీలకు ఓట్లు వేయొద్దు. ఒకవేళ వేస్తే మన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రహించుకోవాలి.
మనం ఓట్లు వేసి గెలిపించిన వారే మనపై స్వారీ చేస్తున్నారు. చట్టాల పేరుతో అసంబద్ధమైన చట్టాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. మన దేశంలో ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. ఓట్ల కోసం పార్టీలు ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయి.
ఈ కమిటీ ఏర్పాటైతే ప్రాజెక్టులు కట్టే ముందు బ్లూ ప్రింట్ తీసి అనుమతి తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. అందుకే రూ. లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అవుతోంది. దీంతో ప్రజల డబ్బు పనికి రాకుండా పోతోంది.
ప్రజాస్వామ్యంలో ఓటరు ఓటు వేయడానికే పరిమితమా? నాయకులు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఓటరు చేతిలో ఓటు తప్ప ఏ ఆయుధమూ లేదు. దీంతో పాలకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. ఈనేపథ్యంలో మనం గెలిపించే నాయకులు మనపై స్వారీ చేయడమేమిటి? వారిని మనం కంట్రోల్ చేయలేమా? అలాంటి హక్కులు ఓటర్లకుండాలనే వదనలు వస్తున్నాయి. ఇలా చేయడంతోనే పాలకులు మన చేతుల్లో ఉంటారని చెబుతున్నారు. దీని కోసమే సుప్రీంకోర్టు ఈ విధంగా నిర్ణయించింది.